Sunday, February 23, 2025

అనుమానస్పదస్థితిలో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -
Inter student dies under suspicious in hyderabad
గౌలిదొడ్డి ఎస్‌డబ్లూఆర్‌ఈఐలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి
అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నాగర్‌కర్నూలు జిల్లా, మండలం, గ్రామం చారగొండకు చెందిన వంశీకృష్ణ(16) గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూట్ అకాడమీలో ఎంపిసి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వంశీకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం ఉదయం 8గంటలకు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే కాలేజీకి వచ్చిన బంధువులు, తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై వెంటనే విచారణ చేయించాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News