Wednesday, January 22, 2025

గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్ : గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఆదివారం చోటుచేసుకుంది. జహీరాబాద్ రూరల్ పోలీసులు వివరాల ప్రకారం…. జహీరాబాద్ మండలం తూముకుంట గ్రామానికి చెందిన స్వప్న (16) గురుకులంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆదివారం కావడంతో కళాశాలలో విద్యార్థులంతా ఆటలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.

ఆ సమయంలో స్వప్న విద్యార్థులు ఎవరూలేని గదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది స్వప్నను హుటాహుటిన జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు నిర్థ్ధారించారు. స్వప్న ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News