- Advertisement -
అర్వపల్లి : పురుగుల మందు తాగి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విధ్యార్థిని మృతి చెందిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకుంది . అర్వపల్లి ఎస్‌ఐ అంజిరెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల (17) సంవత్సరాలు శుక్రవారం రోజు తల్లి పూజితను మందలించడంతో పురుగుల మందు తాగడంతో కుంబీకులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు మృతి చెందడంతో మృతురాలి అక్క లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపారు.
- Advertisement -