Sunday, December 22, 2024

సూర్యాపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సూర్యాపేటలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫేర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి , పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా మాట్లాడిందని తెలిపారు. శనివారం రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 సమయంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతున్న

సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగు లేదని, ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్‌టిఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారు. తమ కూతురు మరణంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలనాయక్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News