Sunday, December 22, 2024

డిప్రెషన్, అనారోగ్యంతో విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

డిప్రెషన్, అనారోగ్యంతో ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ప్రకారం.. దండమూడి ఎంక్లేవ్ సమీపంలో ఉన్న తిరుమల కాసాని రెసిడెన్సిలో రెండో అంతస్తులో నివాసముంటున్న రామదుర్గాప్రసాద్ అరుణ దంపతుల కూతురు స్వప్న(17) మారేడ్పల్లిలోని చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.

గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్వప్న, ఆదివారం రాత్రి తల్లిదండ్రులు పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న స్టడీ రూమ్ కి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి చూసిన తల్లిదండ్రులకు స్వప్న సీలింగ్ ఫ్యాన్ కు వ్రేలాడుతూ కనిపించింది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News