Tuesday, January 21, 2025

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు అధికారులు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవడంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

ఇందులో మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివకుమార్.. గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో చనిపోతున్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News