Monday, December 23, 2024

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

మెదక్: 12 నుంచి 19 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరుగు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతూ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2ః30 గంటల నుంచి 5ః30 గంటల వరకు జరుగుతుందని అన్నారు.

మొదటి సంవత్సరం విద్యార్థులు 4,227 మంది, ద్వితీయ సంవత్సరం 2,454 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం జిల్లాలో 23 కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 23 చీఫ్ సూపరింటెండెంట్లు, 23 శాఖాధికారులతోపాటు ఒక ఫ్లయింగ్ స్కాడ్ టీమ్, 4 సిట్టింగ్ స్కాడ్, 4 కస్టడీయన్స్ టీములు ఏర్పాటు చేశామని వీరు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు పోలీసు శాఖ ప్రశ్నాల స్టోరేజీ, తరలింపులో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, తహశీల్దార్లు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విదించాలని, పరీక్షా సమయంలో జిరాక్స్‌సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని విద్యుత్‌లో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్‌లో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగ్గా రిసీవ్ చేసుకుని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, డిఈఓ రాధాకిషన్, రామేశ్వర్‌రావు, డాక్టర్ నవీన్, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News