* కెసిఆర్ నిర్ణయంతో స్థానిక సంస్థలకు రూ.500కోట్ల నిధులు
* త్వరలోనే మహిళలలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
* ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ తో యువతకు ఉద్యోగావకాశాలు
* ప్రతి కుల సంఘానికి ఆత్మగౌరవ భవనాలు
* సిద్దిపేటలోనే తొలి పూసల సంఘం భవనం ప్రారంభం
* ఎంబీసీ కార్పొరేషన్‌కు ఈ సారి రూ.500 కోట్లు కేటాయింపు
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూ. 699కోట్లు కోత పెడితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించి కడుపు నింపిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 23, 26, 27, 28, 32 వార్డుల్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుల సంఘాల భవనాలను నిర్మించుకున్నామని అన్నారు. గత ప్రభుత్వాలలో ఎంపిటిసిలు, జడ్పీటిసిలు ఉత్సవ విగ్రహాలుగా ఉండేవారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. సిఎం కెసిఆర్ చొరవతోనే నిధులు మంజూరు ఇతర రాష్ట్రాల్లో ఎంపిటిసిలు, జడ్పీటిసిలకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
త్వరలోనే మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తామని, సిద్దిపేట జిల్లాలోఐటీ పార్కు, ఇండస్ట్రీయల్ రావడం ద్వారా ఈ ప్రాంతం యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. సిద్దిపేటలో తొలి సారిగా రూ. 40 లక్షలతో పూసల సంఘం భవానాన్ని నిర్మించుకున్నామని అన్నారు. ఒక రంగధాంపల్లిలోనే 12 కుల సంఘాలకు భవనాలను నిర్మించుకున్నామని తెలిపారు. ఎంబిసి కార్పొరేషన్ కింద అసెంబ్లీలో రూ. 500 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆత్మగౌరవ భవనాలు ప్రేరణ, ఐక్యతను పెంపొందిస్తాయని మంత్రి అన్నారు. మంత్రి పర్యటనలోభాగంగా సిద్దిపేట 26వ వార్డులో సుభాష్ నగర్, పద్మానగర్, శ్రీరామ్‌నగర్, ఇందిరానగర్, శాంతి నగర్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రూ. 20లక్షలతో ప్రహరీగోడ నిర్మాణం, రూ. 30 లక్షలతో సిసి రోడ్డునిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కాలకుంట కాలనీలో రూ. 20 లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగధాంపల్లిలో సుతారి సంఘం, మహిళా సమైఖ్య భవనం, ముదిరాజ్ సంఘం భవనాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసీచైర్మన్ పాల సాయిరాం, వైస్ చైర్మన్ అత్తర్ పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పబ్లిక్ హెల్త్ ఈఈ వీర ప్రతాప్, ప్రజాప్రతినిధులు, నాయకులు కొండం సంపత్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, తెల్జేరు శ్రీనివాస్ యాదవ్, ముత్యాల కనకయ్య, నాగిరెడ్డి, సద్ది నాగరాజు రెడ్డి, అబ్దుల్ మోయీజ్, జావిద్, ఐలయ్య, బత్తుల చంద్రం, ఎల్లం, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
interest-free loans for women’s says minister harish