ఆత్మకూరు : మహిళా సంఘాలలో ఉన్న నిరుపేద మహిళ కుటుంబాలను గుర్తిం చి 5 లక్షలు ఆపైన జీవనోపాధి కొరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నామని అడిషనల్ డిఆర్‌డిఓ సరోజ పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండల స మాఖ్య కార్యాలయంలో అమరచింత, ఆత్మకూరు మండలాల ఐకెపి వివోలకు కేంద్ర ప్రభుత్వ పథకం లకపతి దీదీ పై రెండోరోజు ఇస్తున్న శిక్షణలో బాగంగా ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు.
శిక్షణ అనంతరం ప్రతి వివోఎ నిరుపేద మహిళ కుటుంబాల ఇంటి దగ్గర వారి కుటుంబ సభ్యులతో కూర్చుని వారి కుటుంబ జీవనోపాధి పై సూక్ష్మ ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో వివోఎకు 80 మంది లకపతి దీదీలను గుర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు డిపియం అరుణ, ఎపియం కృష్ణవేణి, అమరచింత , ఆత్మకూరు మండలాల ఎపిఎంలు శ్రీనివాస్, వెంకటేష్, సమాఖ్య అధ్యక్షులు మహేశ్వరి, కార్యదర్శి సునీత, సిసిలు ఆంజనేయులు, తిరుపతమ్మ, వివోఎలు తదితరులు పాల్గొన్నారు.