కొల్లాపూర్ రూరల్ : మహిళా సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగా ణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రం గాల్లో రాణించే విధంగా వారిని చైతన్యపరిచి మహరాణులుగా తీర్చిదిద్దడమే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అ మలు చేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమానికి పా టు పడిన ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. ప్రభుత్వం మహిళలకు శ్రీనిధి పథకం ద్వా రా వడ్డీలేని రుణాలను అందజేస్తుందన్నారు.
మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి పొందాలని కోరారు. మహిళలు అన్ని రం గాల్లో రాణించినప్పుడే దేశం ప్రగతి పథంలో ము ందుకు సాగుతుందన్నారు. అంగన్వాడీ ఆశా వర్క ర్ల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన వారికి కెసిఆర్ కిట్టు, కెసిఆర్ న్యూట్రిష న్ కిట్లు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, షీ టీంలతో మ హిళలకు రక్షణ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెటారన్నారు.
అనంతరం పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అదే విధంగా శ్రీనిధి పథకం కింద 155 స్వయం సహకార సంఘాలకు 6 కోట్ల 12 లక్షల 15 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధు లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.