న్యూఢిల్లీ : ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బిఒబి), హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీని పెంచాయి. ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డిపై 7.25 శాతం వరకు వడ్డీని పొందుతారు. పెట్టుబడి పెట్టే ముందు, దాని కాలవ్యవధి గురించి ఆలోచించడం ముఖ్యం, ఎందుకంటే ఇన్వెస్టర్లు మెచ్యూరిటీకి ముందే ఉపసంహరించుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎఫ్‌డి మెచ్యూర్ కావడానికి ముందే వెనక్కి తీసుకుంటే 1 శాతం వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిపాజిట్‌పై వచ్చే మొత్తం వడ్డీని తగ్గించవచ్చు. మొత్తం డబ్బును ఒకే ఎఫ్‌డిలో పెట్టుబడి చేయరాదు. ఒక బ్యాంకులో రూ. 10 లక్షల ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దీనికి బదులుగా రూ.1 లక్ష చొప్పున 8 ఎఫ్‌డిలు, రూ. 50 వేల చొప్పున 4 ఎఫ్‌డిలలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టండి. దీంతో మీకు మధ్యలో డబ్బు అవసరమైతే ఎఫ్‌డిని తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది.