0.10 శాతం మేరకు పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డి) వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం చొప్పున పెంచింది. దీంతో ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేటు 5 నుండి 5.10 శాతానికి పెరగనుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 5.50 నుంచి 5.60 శాతానికి పెంచారు. కొత్త వడ్డీ రేటు జనవరి 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డిలకు అమలవుతాయి. ఇతర కాలాల ఎఫ్‌డిల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. 5-10 సంవత్సరాల ఎఫ్‌డిలపై ఎస్‌బిఐ అత్యధికంగా 5.40 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ కాలానికి బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీని అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) కూడా వడ్డీ రేట్లను మార్చాయి. రూ.2 కోట్ల లోపు మొత్తానికి కొత్త వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి.
ఎఫ్‌డిపై ఎస్‌బిఐ చెల్లించే వడ్డీ రేట్లు ఇవే..
వ్యవధి కొత్త వడ్డీ రేటు (%) సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు(%)
7 -45 రోజులు 2.90 3.40
46 -179 రోజులు 3.90 4.40
180- 210 రోజులు 4.40 4.90
211- 1 సంవత్సరం లోపు 4.40 4.90
2 సంవత్సరాల లోపు 5.10 5.60
3 సంవత్సరాల లోపు 5.10 5.60
3 5 సంవత్సరాలు 5.30 5.80
5 10 సంవత్సరాలు 5.40 6.20
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డిపై ఇచ్చే వడ్డీ రేటు?
వ్యవధి కొత్త వడ్డీ రేటు (%) సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు(%)
7-14 రోజులు 2.50 3.00
15-29 రోజులు 2.50 3.00
30-45 రోజులు 3.00 3.50
46-60 రోజులు 3.00 3.50
61-90 రోజులు 3.00 3.50
91 -6 నెలల వరకు 3.50 4.00
2 సంవత్సరాల లోపు 5.00 5.50
2 నుంచి 3 సంవత్సరాల లోపు 5.20 5.70
3 నుంచి 5 సంవత్సరాల లోపు 5.40 5.90
5 నుంచి- 10 సంవత్సరాల లోపు 5.60 6.35
కోటక్ బ్యాంక్ ఎఫ్‌డిపై ఇచ్చే వడ్డీ రేటు?
వ్యవధి కొత్త వడ్డీ రేటు (%) సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు(%)
7-30 రోజులు 2.50 3.00
181 -364 రోజులు 4.40 4.90
365 -389 రోజులు 4.90 5.40
2 సంవత్సరాల లోపు 5.10 5.60
2 నుంచి – 3 ఏళ్ల లోపు 5.15 5.65
3 నుంచి- 10 ఏళ్ల లోపు 5.30 5.80