Monday, December 16, 2024

ఆయిల్ పామ్ మొక్కలపై ఆసక్తి చూపాలి

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే అయిల్ పామ్ పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపాలని జడ్పి మాజీ చైర్మెన్ లోలం శ్యాంసుందర్ అన్రాఉ. మండలంలోని నగర్ గ్రామంలో మంగళవారం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ లోలం శ్యాంసుందర్ మండల నాయకులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటల సాగుకు మొక్కలు ఇరిగేషన్ డ్రిప్ తదితరాలకు షెడ్యూల్ కులాల వారికి 80 శాతం నుంచి 100 శాతం సబ్సిడీని అందిస్తుందని ఆయిల్ పామ్ మొక్కలను నాటేందుకు వర్షాకాలం ఎంతగానో దోహదపడుతుందని అంతర్ పంటలుగా సోయాబీన్, పెసరి, కంది, పత్తి, మొక్కజొన్న, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయలు తదితరాలను వేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చునని ఆసక్తి గల రైతులు ముందుగా డిడిలు కట్టుకొని పట్టాపాస్‌బుక్ ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ ఫోటో లతో వ్యవసాయ విస్తర్ణ అధికారులకు మం డల ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ సేఖర్‌లను 9154978398 సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి లలితా భోజన్న, పిఎసిఎస్ చైర్మెన్ రత్నాకర్ రావు, సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఎంపిటిసి మగ్గిడి రాణి అనిల్, ఉద్యానవన శాఖ అధికారి హర్షవర్ధన్ రెడ్డి, ఏఈవో మౌనిక, ఆయిల్ పామ్ మండల క్లస్టర్ అదికారి అడెపు శేఖర్, విజయ డెయిరీ ఫీల్డ్ సూపర్‌వైజర్ దండే రమేష్, రైతులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News