Saturday, December 21, 2024

ఇపిఎఫ్‌కు వడ్డీకి ఎగనామం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఇపిఎఫ్‌ఓ) ఖాతాదారులకు 2021 22 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ఇప్పటికీ వారి ఖా తాల్లోకి జమ కాకపోవడంపై ఇపిఎఫ్‌ఒలో ట్రస్టీలుగా ఉన్న కా ర్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2021 22 ఆర్థిక సంవత్సరానికి ఉ ద్యోగులు తమ ఖాతాల్లో దాచుకున్న మొత్తానికి 8.1 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని యాజమాన్యాలు, కార్మి క సంఘాల ప్రతినిధులతో కూ డిన ఇపిఎఫ్‌ఒ ట్రస్టు బోర్డు 2022 మార్చిలో నిర్ణయించింది. దీనికి అదే ఏడాది జూన్‌లో ట్రస్ట్ బో ర్డు ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటిదాకా కూడా ఆ మొత్తం సభ్యుల ఖాతాల్లోకి జమ కాలే దు. తాను పది రోజుల క్రితమే ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు బోర్డు సభ్యుడైన హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) కేంద్ర కార్యదరి హర్భజన్‌సింగ్ సంధూ పిటిఐతో అం టూ.. సిస్టమ్ (సాఫ్ట్‌వేర్)లో సమస్య ఉందని, త్వ రలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తనకు చెప్పారన్నారు.

అయతే వడ్డీని గత ఏడాది మార్చిలోనే నిర్ణయించారని, జూన్ నెలలో దానికి ఆమోదం కూడా తెలిపారని, అలాంటప్పుడు ఇంత ఆలస్యం జరగడం ఏమిటని ఆయన అన్నారు. అయితే ఈ ఆలస్యానికి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సరయిన కారణం చెప్పడం లేదని మరో ట్రస్టీ, సిఐటియుకు చెందిన ఎకె పద్మనాభన్ అంటూ, త్వరలో జరగబోయే ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల సమావేశంలో తాను ఈ విషయాన్ని లేవనెత్తుతానని చెప్పారు. కాగా ఈ అంశాన్ని తాము కూడా పరిగణనలోకి తీసుకున్నామని, ఇపిఎఫ్‌ఓ అధికారులతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని యాజమాన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ట్రస్టీ కె ఇ రఘునాథన్ అన్నారు. కాగా ఈ విషయమై ఇపిఎఫ్‌ఓను పిటిఐ ప్రశ్నించగా సంస్థనుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

అంతకు ముందు సంవత్సరంలో పిఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండగా కొవిడ్ కారణంగా 2021 22లో దీన్ని 8.1 శాతానికి తగ్గించారు.1977 78 ఆర్థిక సంవత్సరం తర్వాత పిఎఫ్‌పై వడ్డీ రేటు ఇంత తక్కువగా నిర్ణయించడం ఇదే మొదటిసారి. అయితే దీన్ని కూడా సర్కార్ సరిగా చెల్లించకపోవడం గమనార్హం. ప్రభుత్వం దాదాపు అన్ని కేసుల విషయంలోను వడ్డీని వాటి ఖాతాల్లోకి జమ చేసిందని, ఉద్యోగుల విషయంలో మాత్రం సాంకేతిక సమస్యను సాకుగా చూపించి జాప్యం చేయడం ఏమిటని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో దేనికీ లేని సాంకేతిక సమస్య మాకేనా అని కార్మికులు వాపోతున్నారు. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాని కారణంగా చందాదారుల ఖాతాల్లోకి జమ అయిన వడ్డీ చందాదారుల స్టేట్‌మెంట్లలో కనిపించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది అక్టోబర్‌లో వివరణ ఇచ్చింది.

ఇపిఎఫ్‌ఓ చందాదారులందరి ఖాతాల్లోకి వడ్డీని జమచేయడం జరిగిందని, అయితే పన్నులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఇపిఎఫ్‌ఓ అప్‌డేట్ చేస్తున్నందున అది చందాదారుల స్టేట్‌మెంట్లలో కనినించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పట్లో ఒక ట్వీట్‌లో తెలియజేసింది. అయితే ఇది జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉండడంతో కార్మికుల్లో అసహనం, అనుమానాలు పెరిగిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News