Monday, December 23, 2024

పెళ్లి చేసుకుంటానో.. లేదో!

- Advertisement -
- Advertisement -

Interesting comments on Regina's love and marriage

అందాల భామ రెజీనా కాసాండ్రా ’శివ మనసులో శృతి’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ’కొత్త జంట’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుని టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారింది రెజీనా. ఇకపోతే త్వరలోనే ఈ భామ ’శాకిని డాకిని’ మూవీతో అలరించబోతోంది. కొరియన్ మూవీ ’మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ ఇది. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా, నివేదా థామస్ టైటిల్ పాత్రలను పోషిస్తున్నారు.

ఈ యాక్షన్, కామెడీ థ్రిల్లర్ ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. తన పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చింది. జీవితంలో పెళ్లి చేసుకుంటానో..లేదో కూడా తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి గత కొద్ది రోజుల నుంచి రెజీనా పెళ్లిపై ఎన్నో వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ఆమె సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసుకుందని వార్తలు వచ్చాయి.

కానీ ఈ వార్తలను అప్పుడే రెజీనా ఖండించింది. ఇక తాజా ఇంటర్వ్యూలో రెజీనా ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెజీనా మాట్లాడుతూ “నేను గతంలో ఒకరిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల మా ప్రేమ 2020లోనే ముగిసిపోయింది. దాని నుంచి బయటపడటానికి కొంత టైమ్ పట్టింది. ఇప్పుడు మాత్రం ఎవరిని ప్రేమించడం లేదు. సింగిల్ గానే ఉన్నాను. ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకుంటానో.. లేదో కూడా తెలియదు. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా ఎలా జీవించాలో చిన్నతనం నుంచే అమ్మ నేర్పింది”అని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News