- Advertisement -
అమరావతి: ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ను ఢిల్లీ నుంచి వచ్చాక సభకు ఎప్పుడొస్తారని ఎపి మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అడిగారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. పవన్ ను ఎలా ఉన్నారని బొత్స పలకరించారు. ఎప్పుడు వచ్చేది సమాచారం ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్. కొల్లేరు వాసుల అభ్యర్థనను పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చానని బొత్స చెప్పారు. రైతులను కలిసేందుకు సమయం ఇవ్వాలని పవన్ ను కోరానని తెలిపారు. ఢిల్లీ నుంచి రాగానే సమయం ఇస్తామని పవన్ కల్యాణ్ తెలియజేశారు.
- Advertisement -