Monday, January 20, 2025

మంత్రి హరీశ్ రావు, రాజసింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ

- Advertisement -
- Advertisement -

Interesting discussion between Minister Harish And Raja singh

హైదరాబాద్: కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి మంత్రి హరీశ్ పేషేంట్ అడిగారు. వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయని పేషేంట్ అనడంతో ఎమ్మెల్యే రాజసింగ్ మొఖంలో నిజమే కదా అనే ఫీలింగ్ నవ్వుతూ వ్యక్తపరిచాడు. రాజాసింగ్ జీ… జర సునో అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజసింగ్ పేషేంట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతం అని మరోసారి రుజువైందని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులలో సైతం చర్చ మొదలైంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కళ్ళ ముందు నిజం కనిపించడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News