జులై – సెప్టెంబర్ త్రైమాసికానికి 0.30% పెంచిన కేంద్రం
పిపిఎఫ్, సుకన్య సమృద్ధి రేట్లలో వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.30 శాతం వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వసాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో చాలా వరకు పథకాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలోనే స్వల్పంగా రేట్లను పెంచారు. మొత్తంగా అన్ని పథకాల వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 8.2 శాతం మధ్య ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సి), కిసాన్ వికాస్ పత్ర (కెవిపి), సు కన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) పథకాల రేట్లలో ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు 1 సంవత్సరం పోస్టాఫీసు టై మ్ డిపాజిట్‌పై 6.80 శాతానికి బదులుగా 6.90 శాతం ఇస్తారు. 2 సంవత్సరాల కాల డిపాజిట్లపై రేటు 6.9 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. అలాగే 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఆర్‌డిపై 6.2 శాతం నుండి 6.5 శాతానికి వడ్డీ రే టును పొం దుతారు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తారు.