Thursday, January 23, 2025

మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి!

- Advertisement -
- Advertisement -

couple attacked
సరూర్‌నగర్: హైదారబాద్‌లోని సరూర్‌నగర్ మండల్‌లోని మర్పల్లి గ్రామంలో మంతాంతర వివాహం చేసుకున్నందుకు బుధవారం రాత్రి వారిపై దాడి జరగింది. ఈ దాడిలో భర్త చనిపోయాడు. వివరాలలోకి వెళితే…బి. నాగరాజు(25), అష్రిన్ సుల్తానా(23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వీరిపై భార్య తరఫు కుంటుంబీకులు ఇద్దరు ఇనుప రాడ్లతో దాడిచేశారు. దాడిచేసిన వారు కత్తి తీసుకుని నాగరాజును కసకసా పొడిచేస్తుంటే ఆ దారిన వెళుతున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగరాజు దాడి జరిగిన చోటే అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అంతా సిసిటివిలో రికార్డు అయింది. కాగా గాయాలపాలైన అష్రిన్ సుల్తానాను దారిన వెళుతున్న వారు దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ దంపతులు మర్పల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా వారు ప్రేమించుకున్నారని, అయితే వారి సంబంధాన్ని అమ్మాయి తరఫు కుటుంబీకులు వ్యతిరేకిస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు. పైగా ఆ అమ్మాయిని అతడితో కలువకుండా కట్టడి చేశారని కూడా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News