Thursday, January 23, 2025

నాపై తప్పుడు ప్రచారం

- Advertisement -
- Advertisement -

హైకోర్టులో తెలంగాణ మాజీ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ పిటిషన్
హైదరాబాద్ : తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తొలగించేలా ఆదేశించాలంటూ తెలంగాణ మాజీ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ కోర్టుకెక్కారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, తన బిడ్డ పెండ్లి ఖర్చుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టుకు వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ హైకోర్టులో రజత్ కుమార్ ఓ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, ఇప్పటికే ఉన్న కథనాలను తొలగించాలని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. కేంద్ర ఐటీ శాఖ, గూగుల్, యూట్యుబ్ లను ప్రతివాదులుగా చేర్చారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో గతంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించిందని, తాను ఏ తప్పూ చేయలేదని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు. దీనికి సంబంధించిన రిపోర్టు కాపీని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని రజత్ కుమార్ కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నందా విచారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News