Monday, December 23, 2024

నేటి నుంచి ఇంటర్‌లో ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -

టెన్త్ గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లు
జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం
జూన్ 30 వరకు అడ్మిషన్లు పూర్తి
టిఎస్‌బిఐఈ వెబ్‌సైట్‌లో ఉన్న కళాశాల్లోనే విద్యార్థులు చేరాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న బోర్డు అధికారులు
అడ్మిషన్లు లేవని కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు కళాశాలలు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టు జూనియర్ కళాశాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 1నుంచి ప్రారంభించాలని, జూన్ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని, ఇంటర్ బోర్డు సూచించడంతో కళాశాల నిర్వహకులు ఆదిశగా ఏ ర్పాట్లు చేసుకున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్ర వేశ పరీక్ష లేకుండా చేర్చుకోవాలని, పదవ తరగతి గ్రేడింగ్ ఆధారంగానే అడ్మిషన్లు చేయాలని బోర్డు పేర్కొంది. ఇంటర్‌బోర్డు గుర్తింపు ఉన్న కళాశాల జాబితాను టిఎస్‌బీఐఈ అ ధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఈకాలేజీల్లో విద్యార్థు లు చేరాలని బోర్డు అధికారులు సూచించారు.

ప్రతి కాలేజీ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్‌సిలకు 15, ఎస్‌టిలకు 10,బిసిలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సిసి, స్పోర్ట్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనకబడిన వారికి 10 శా తం కేటాయించాలన్నారు. ప్రతి కళాశాల బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఇంటర్‌లో ప్రతి సెక్షన్‌లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్ నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డు అనుమతి తీ సుకోవాలి. ఇందుకు విరుద్దంగా ఏ కాలేజీ వ్యవహరించిన కఠిన చర్యలుంటాయి. విద్యార్థుల ఆధార్ నమోదు చేయా లి. అడ్మిషన్లు వివరాలను ప్రతి రోజు కళాశాల బోర్డుపై ఉంచాలి. ఎన్నిసీట్లు భర్తీ చేశారు. ఎన్ని మిగిలి ఉన్నాయనే ఆప్‌డేట్ సమాచారం నోటీసు బోర్డులో ఉంచాలి. జోగిని, తండ్రిలేని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కళాశాలలు కల్పించాలని బోర్డు పేర్కొంది.

సీట్లు లేవంటూ బోర్డులు పెడుతున్న ప్రైవేటు కాలేజీలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేటి నుంచి ఇంటర్ ప్రవేశా లు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు పేర్కొన్నప్పటికీ పలు ప్రైవేటు కళాశాలు ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయాయని, రెండు, మూడు సీట్లు మాత్రమే ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెబుతున్నారు. దీంతో తమ పిల్లలను పేరు మోసిన కళాశాల్లో చదివిస్తే ఉన్నత చదువుల వైపు వె ళ్తారని ఆశపడితే కార్పొరేట్ కాలేజీలు సీట్లు లేవని చెప్పడం నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రెండు మూడు సీట్లకు లక్షలో ఫీజులు చెబుతున్నారు. మొ దటి సంవత్సరం డే స్కాలర్‌కు కనీసం రూ. 85 వేల నుంచి రూ.1.50లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ వసతి కోసం రూ.2 లక్షల చెల్లించాలని, అవి రెండు వాయిదాల్లో పూర్తి చేయాలని పేర్కొంటున్నారు. ప్రై వేటు కళాశాలల ఫీజుల దెబ్బకు పిల్లలను ఏ కళాశాల్లో చేర్పించాల్లో అర్ధం కాక తలపట్టుకుంటున్నారు. తమ సంపాదనంతా చదువులకే ఖర్చు చేయాల్సివస్తుందంటున్నారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసే విద్యాసంస్ధలపై ఇంటర్‌బోర్డు అధికారులు నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News