మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు నిర్వహిస్తున్న జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ జిల్లా వ్యాప్తంగా 121 పరీక్ష కేంద్రాల్లో 64,331మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతున్నట్లు చెప్పారు. పరీక్షలు సజావుగా నిర్వహించడానికి 4 ఫ్లయింగ్ స్కాడ్స్, 5 సిట్టింగ్ స్కాడ్, బృందాలు పరీక్షలు నిర్వహణ కమిటీ, హైపర్‌ఫ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మంచినీరు, ఫర్నిచర్, శానిటైషన్ సమకూర్చినట్లు, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య ఆరోగ్య తరుపున ఓఆర్‌ఎస్, ఇతర అత్యవసర మందులను ఎఎన్‌ఎంలను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ ప్రతి పరీక్ష కేంద్రాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం శానిటైజ్ చేసినట్లు, టిఎస్‌ఆర్‌టి శాఖ అన్ని రూట్లలో ఉదయం 8 గంటల నుంచి 9గంటలవరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, విద్యార్థుల సౌలభ్యం కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో టిఎస్‌బిఐఈ సెంటర్ లోకేటర్ యాప్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయానికి కంటే గంట ముందుగానే చేరుకోవాలని, హాల్‌టికెట్స్ అందని విద్యార్థులు టిఎస్‌బిఐఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోని పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.