Monday, December 23, 2024

కళాశాల యాజమాన్యం వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం

- Advertisement -
- Advertisement -

కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురు తండాకు చెందిన యువతి శ్రీ చైతన్య కళాశాల కెకె బాలికల క్యాంపస్ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు గాను 432 మార్కలు సాధించిన విద్యార్థిని గత కొన్ని రోజులుగా మానసిక వేదనకు గురై శనివారం రాత్రి హస్టల్ గదిలో ప్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి విద్యార్థినీలు కళాశాల యాజమాన్యంకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్థానికుల సమాచరం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News