కాచిగూడ : ఇంట్లో నుంచి స్నాక్స్ తేవడానికి వెళ్లి ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ. బి నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గోల్నాక ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ కుమార్తె అక్కమ్మ పూజిత (18) మహబూబియా కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 21వ తేదీన స్కాక్స్ తేవడానికి ఇంట్లో నుంచి మార్కెట్కు వెళ్లిన పూజిత తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో బంధుమిత్రుల ఇండ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి సత్యనారాయణ కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి పూజిత వెళ్లె సమయంలో నలుపు రంగు చొక్క, బిస్కెట్ రంగు ఫ్యాంట్ ధరించి, 4.8 ఎత్తు ఉన్నట్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
Intermediate students missing in Kachiguda