మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాక్షాతూ ఎఐసిసి పరిశీలకుడి సాక్షిగా ఆ పార్టీ కార్యకర్తలు కుర్చీలను విసురుకొని ఘర్షణ పడడంతో ఒక కార్యకర్తకు గాయాలయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కోసం పలు సెగ్మెంట్ల నుంచి పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. సందర్బంగా ఖమ్మం పా ర్లమెంట్ ఎఐసిసి ఇన్‌చార్జిగా నియమితులైన మహ్మద్ ఆరీఫ్ ఖాన్ గత రెండురోజుల నుంచి జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయసేకరణ చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన జయభేరి సభ సన్నాహక సమావేశంలో బిసిలకు రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిసి కార్యకర్తలంతా రచ్చ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కాంగ్రె స్ కార్యాలయంలో వారీగా సమీక్ష ప్రారంభమైంది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మహ్మద్ జావేద్ పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించి బలప్రదర్శన చేశారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కూడా బలప్రదర్శన చేశారు.
ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీనికి ప్రతిగా కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి వర్గీయులు కూడా రేణుక చౌదరి జిందాబాద్ అంటూనినాదాలు చేశారు. ఈ సందర్బంగా రఘునాథపాలేం మండల కమిటీ విషయంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత సత్తుపల్లి సెగ్మెంట్ సమావేశం ప్రారంభం కాగానే ఇక్కడి నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న పాత, కొత్త కాంగ్రెస్ నేతల వర్గీయుల మధ్య తీవ్రస్థ్దాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన డా. మట్టా దయానంద్ వర్గానికి, ఓయూ ఉద్యమ నాయకుడు మానవాతారాయ్ వర్గీయుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. డా. మట్టా దయానంద్ సతీమణి డా. రాగమయి సత్తుపల్లి నుంచి భారీగా తరలివచ్చిన తన అనుచరులతో సమావేశం హాల్‌లోకి వచ్చారు. దీనిని చూసిన మానవత్‌రాయ్ వర్గీయులు సత్తుపల్లి సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయిన సీటు అని, ఈ సీటుకు బిసిలకు అర్హత లేదని అభ్యంతరం చెప్పారు. దీంతో దయానంద్ వర్గీయులు సమాధానం చెబుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కార్యకర్తలు కూర్చీలను ఒకరిపై ఒక్కరూ విసురుకొని ఘర్షణ పడ్డారు. ఘర్షణలో కూర్చి సిలింగ్ ఫ్యాన్ కు ఎగిరి తలడంతో ఫ్యాన్ స్పిడ్ కు కూర్చి వెళ్ళీ సత్తుపల్లికి చెందిన ఒక కార్యకర్త తలకుగాయం అయ్యింది. డాక్టర్ మట్టా దయానంద్ ఎస్సీ సర్టిపికేట్ పై వివాదం కొనసాగుతుంది. కలెక్టర్ దయానంద్ ఎస్‌సి సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, దీనిపై మాట్టా దయానంద్ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ కుల రిజర్వేషన్ సర్టిఫికెట్ పై వివాదం ఉన్నందునా ఆయన ఈ సమావేశానికి రాలేదు. అయితే ఎస్‌సికి చెందిన ఆయన భార్య డా. రాగమయి ఈ సమావేశానికి రావడంతో ఇక్కడి నుంచే టిక్కెట్ ను ఆశిస్తున్న మానవత్ రాయ్ వర్గీయులు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో డిసిసి పెద్దలు సర్ది చేప్పడంతో సద్దుమణిగింది.