- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మూడు నెలల్లోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తొలి అడుగ పడిందని సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు, న్యాయమూర్తులు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపిలు, ఎంఎల్ఎలు, సిఎస్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిజెఐ ప్రసంగించారు. ఈ హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. దేశంలోనే తొలి కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
- Advertisement -