Monday, December 23, 2024

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఐదు భవనాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు వరించాయి. లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. అటు హైదరాబాద్ లోని మోజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అంతర్జాతీయ అవార్డలు దక్కాయి. రాష్ట్రానికి అంతర్జాతీయ అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News