Saturday, November 16, 2024

రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై బౌద్ధుల భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బెంగుళూరుకు చెందిన ప్రముఖ బుద్ధిస్ట్ అధ్యాత్మిక సంస్థ ‘మహాబోధి సొసైటీ’కి చెందిన ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి బుద్దిస్ట్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నాగార్జున సాగర్‌లోని ప్రతిష్ఠాత్మక బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మొనాస్టరీ అండ్ బుద్ధిస్ట్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై వారు ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బౌద్ద వారసత్వ థీమ్ పార్కు , బుద్ధవనం ఒక అద్బుత శిల్ప కళానిలయమని అన్నారు. బుద్ధవనంలోని వివిధ పర్యాటక ఆకర్షణలు, వాటి ప్రత్యేకతలను ఆయన వివరిస్తూ బుద్దవనంలో కృష్ణతీర్థం వద్దకు ఎందరో ప్రకృతి ప్రేమికులు వస్తారన్నారు. బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణ అయిన మహా స్థూపం చుట్టూ అలంకరించిన శిల్పఫలకాల్లోని బుద్దిని జీవితం, బౌద్ధ సాంస్కృతిక అంశాలను వారికి మంత్రి శ్రీనవాస్ గౌడ్ వివరించారు. ఈ సమావేశం లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ఎండి మనోహర్, మహాబోధి సొసైటీ ప్రతినిధులు పూజ్య ఆనంద భన్తే, సంఘపాల బిక్షు, బోధిరతన మహాబోధి విహరి మహేంద్ర పాల్య, బుద్ధవనం సిఈవో సుదాన్ రెడ్డి, డా. ఈమని శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News