Wednesday, January 22, 2025

యశోద హాస్పిటల్స్‌లో ఎక్మోపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్

- Advertisement -
- Advertisement -

హైటెక్-సిటీ యశోద హాస్పిటల్స్‌లో ఎక్మోపై భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఎక్మోపై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో 20 మందికి పైగా ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ అధ్యాపకులు, 100 మందికిపైగా ప్రసిద్ధ జాతీయ అధ్యాపకులు, భారతదేశం నలుముల నుండి 1000 మందికి పైగా పాల్గొన్నారు. గత దశాబ్దకాలంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఎక్మో సమావేశాలలో ఇది ఒకటి.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్, డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఎక్మోకు రూపకల్పన జరిగినా పరిశోదనలు, వాడకంలో అనుభవాల కారణంగా అప్పట్లో ఎక్మో ఉపయోగించడం చాలా తక్కువగా ఉండేదని అన్నారు. ఇప్పుడు ఈ ఎక్మో పరికరం అత్యంత ఆధునికంగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమయాల్లో గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో మరింతగా ఆధారపడదగినదిగా తయారయ్యిందని చెప్పారు. భారతదేశంలో కొవిడ్ మహమ్మారి తర్వాత ఎక్మో అవసరం ఎక్కువగా పెరిగిపోయిందని వివరించారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా ఎక్కువ మంది పేషెంట్లను ‘ఎక్మో’ సహాయంతో కాపాడిన ఆసుపత్రుల్లో యశోద హాస్పిటల్స్ ఒకటి అని పేర్కొన్నారు. ఈ ముడు రోజుల అంతర్జాతీయ సదస్సు నైపుణ్యాన్ని పంచుకోవడం, రోగుల సంరక్షణలో ఆవిష్కరణ, సహకారం, శ్రేష్ఠతను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా మాట్లాడుతూ..మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్ళించే పరికరం ఎక్మో అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో ఎక్మో పరికరాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి శ్వాసకోశాలు, గుండె చేసే పనులను శరీరం బయట చేసేలా చేస్తారని అన్నారు. ఎక్మో ఆపరేటింగ్‌లో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతోపాటు ఎక్మో వైద్య రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ ముడు రోజుల అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ రుపొందించామని డాక్టర్ వెంకట్ రామన్ కోలా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News