Wednesday, January 22, 2025

నవంబర్ 2న విశాఖలో నీటిపారుదలపై అంతర్జాతీయ సదస్సు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయరంగంలో సాగునీటి కొరతను అధిగమిచేందుకు ఏపిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లారెడ్డి తెలిపారు. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమీషన్ (ఐసిఐడి) 25వ అంతర్జాతీయ సదస్సు నవంబర్ 2నుంచి 8 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కీలక సదస్సుకు 74దేశాలకు చెందిన 9వందలమంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసిఐడిలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గోని వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏవిధంగా వినియోగించుకోలన్న అంశాలపై చర్చిస్తారని తెలిపారు.సంప్రదాయ నీటివనరులను అభివృద్ది చేయడం, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందకు మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల , మురుగునీటిని శుద్దిచేసి సాగునీటిగా వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడులకోసం శుద్ద జలాల వినియోగం తదితర అంశాలపై చర్చాగోష్టి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

రైతు సాధికారతర అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగాదరల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయరంగంలో సాంకేతికను పెంపొందించడం ,వ్యవసాయ పరిశోధనలు ,ఆవిష్కరణలు , స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరుగుతాయని తెలిపారు.దేశలోని అన్ని రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల ,వ్యవసాయరంగాలకు చెందిన అధికారులు ప్రతినిధులతోపాటు ఇతర దేశాలనుంచి 900మంది ప్రతినిధులు పాల్గొంటారని సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News