Monday, November 18, 2024

నవంబర్‌లో పశువ్యాధులపై అంతర్జాతీయ సదస్సు

- Advertisement -
- Advertisement -

International Conference on Livestock Diseases in November

మనతెలంగాణ/హైదారబాద్ : పశువులకు సంక్రమించే వివిధ రకాల వ్యాధుల నిర్ధారణపై హైదరాబాద్ కేంద్రంగా నవంబర్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. రాజేంద్ర నగర్‌లోని పి.వి.నరసింహరావు పశు వైద్య విశ్వవిద్యాలయం అధ్వర్యంలో జరిగే ఈ సదస్సు నవంబర్ 17నుంచి20వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఇండియన్ వెటర్నిరి పెథాలజీ అసోసియేషన్ ఈ సదస్సుకు సహకారం అందచేయనుంది. ఈ సదస్సుకు సబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్‌ను బుధవారం నాడు పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.రవీందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 500మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొంటారని వి.సి రవీందర్‌రెడ్డి ఈ సందర్బంగా పేర్కొన్నారు. బ్రోచర్ విడుదల కార్యక్రమంలో డీన్ డా.టి.రఘునందన్ , రిజిస్ట్రార్ డా.ఎస్.టి.వీరోజి రావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News