Monday, December 23, 2024

అమెరికాలో రిమ్‌పాక్ నౌకా విన్యాసాలు (కరెంట్ అఫైర్స్)

- Advertisement -
- Advertisement -

international current affairs 2022 telugu

 

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్ధమైంది. జూన్ 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్న ఈ యుద్ధ విన్యాసాలకు అమెరికాలోని హోనోలులు, శాస్ డియాగో వేదిక కానున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి. నాలుగు క్వాడ్ సభ్యదేశాతోపాటు ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రైనై ఇండోనేషియా, సింగపూర్‌లు కూడా ఈ యుద్ధ విన్యాసాల్లో భాగస్వాములు కానున్నాయి. ఈ విన్యాసాల్లో 38 నౌకలు, నాలుగు జలాంతర్గాములు, 170 విమానాలు వినయోగించనున్నారు. వివిధ దేవాలకు చెందిన సాయుధ బలగాల్లోని 26,000 మంది దీనిలో పాల్గొననున్నారు. రిమ్‌పాక్ 2022లో కెనడా, చిలీ, కొలంబియా, డెన్మార్క్, ఈక్వెడార్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పెరూ, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్, టోంగా, యూకే దేశాలు పాల్గొంటున్నాయి.

పీఎం జీవన్ జ్యోతి, సురక్ష బీమా ప్రీమియం పెంపు:

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్ 1వ తేదీ నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవన జ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ. 330 నుంచి రూ. 436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ. 12 నుంచి రూ. 20కి పెంచారు.

భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా:

2021 22 ఆర్థిక సంవత్సరానికి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లు (రూ. 9.27 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది అంతకుముందు 202021లో 80.51 విలియన్ డాలర్లు (రూ.6.25 లక్షల కోట్లు) ఉంది. దీంతో ఇప్పటివరకూ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాను అమెరికా అధిగమించింది.

కొవిడ్ వల్ల తలి దండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ నిధి:

కొవిడ్ కారణంగా తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లలకు 23 ఏళ్లు వచ్చేసరికి పీఎం కేర్స్ నిధి నుంచి రూ. 10 లక్షల మొత్తం సాయంగా అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇనిషియేటివ్ పథకాన్ని మే 29, 2021న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు పాఠశాలల్లో చదువుకునే సమయంలో రూ. 20 వేల స్కాలర్‌షిప్, ప్రతినెలా రూ 4 వేల ఖర్చుల నిమిత్తం అందించనున్నారు. ఈ పథకం కింద పిల్లలు ఉన్నత విద్యాభ్యాసానికి రుణాలు తీసుకునేందుకు కూడా అర్హులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News