Friday, December 20, 2024

జీవ వైవిధ్యం…అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

విభిన్న ఛాయాచిత్రాలను ట్వీట్ చేసిన పర్యావరణ ప్రేమికులు

International day for biological diversity

మనతెలంగాణ/ హైదరాబాద్ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ పురస్కరించుకొని.. ట్వీటర్ వేదికగా పలువురు విభిన్న చిత్రాలను పంచుకున్నారు. జీవ వైవిధ్యం- మన జీవితంతో పాటు ఆరోగ్యం, మనుగడకు దోహదం చేస్తోంది. అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో మనందరి పాత్ర ఉండాలని కోరుతూ.. ప్రకృతిలో జీవ వైవిధ్యం వృద్ధి చెందనివ్వాలని జంతు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. గిరి అడవుల్లో సింహాల చిత్రాలను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు. జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమలలో నీటి కొలను వద్ద పులి చిత్రాన్ని అటవీశాఖ అధికారులు ట్వీట్ చేశారు. జీవ వైవిధ్యం ప్రత్యేకతను తెలుపుతూ నగరంలోని ఇటీవల నిర్మించిన వంతెనల కిందభాగంలో చిత్రించిన జీవ వైవిధ్యం తెలిపే చిత్రాలను పలువురు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News