Monday, December 23, 2024

ఫెర్టిలిటీ సదస్సును నిర్వహించిన నోవా ఇవిఎఫ్ ఫెర్టిలిటీ

- Advertisement -
- Advertisement -

విజయవాడ: భారతదేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ చైన్ల హాస్పిటల్లో ఒకటైన నోవా ఇవిఎఫ్ ఫెర్టిలిటీ, APRCOG ట్రస్ట్, విజయవాడ ఒబెస్ట్ట్రిక్ & గైనకాలజికల్ సొసైటీ (VOGS) సహకారంతో, వంధ్యత్వంతో పోరాడుతున్న జంటలకు ప్రయోజనం చేకూర్చేందుకు సహాయక పునరుత్పత్తి పద్ధతుల (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నిక్స్‌) లో నూతన ప్రక్రియలు, అధ్యయనాలను అన్వేషించడానికి అంకితమైన సంతానోత్పత్తి సదస్సును నిర్వహించింది. నవంబర్ 26, 2023న విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఫెర్టిలిటీ కాన్ఫరెన్స్ లో భాగంగా జరిగిన సెషన్స్‌లో, నిపుణులు పదేపదే గర్భస్రావం కావడంలో జన్యుశాస్త్రం యొక్క పాత్ర, ఈ జంటలకు ప్రీఇంప్లాంటేషన్ జన్యు పరీక్ష వంటి పరీక్షలు ఎలా కీలకమో చర్చించారు, పురుషులలో వంధ్యత్వం, విటమిన్ D, వంధ్యత్వంలో దాని ప్రాముఖ్యత, IVF చికిత్సలలో పురోగతి తదితర అంశాలను సైతం ఇక్కడ చర్చించారు.

అందుబాటులో ఉన్న తాజా నమూనా నమోదు వ్యవస్థ (SRS) 2020 ద్వారా సమర్పించబడిన డేటా ప్రకారం, జాతీయ సగటు సంతానోత్పత్తి రేటు 2.3. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇది అతి తక్కువగా 1.7గా ఉంది. విజయవాడలోని నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీకి చెందిన ఫెర్టిలిటీ నిపుణులు PCOS పెరుగుదల, ఊబకాయం, తక్కువ అండాశయ నిల్వలు సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తున్నట్లు గమనించారు.

సదస్సులో విజయవాడలోని నోవా IVF ఫెర్టిలిటీలో లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వై. స్వప్న MRCOG, CCT (OBS & GYN) UK, పోస్ట్ CCT ఫెలోషిప్ ఇన్ అసిస్టెడ్ కాన్సెప్షన్, షెఫీల్డ్, UK వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న వంధ్యత్వ సమస్యల గురించి మరింత మాట్లాడటం, అవగాహనను వ్యాప్తి చేయడం ఎంత ముఖ్యమో ఆమె వెల్లడించారు, ఇది నిపుణులను సంప్రదించడానికి ఎప్పుడు సరైన సమయమో వ్యక్తులు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడంలో కూడా సహాయపడుతుంది.

ఉదాహరణకు, ఒక జంట IVF కోసం సలహా పొందినట్లయితే, వారు అధిక విజయాన్ని పొందడం కోసం సంతానోత్పత్తి నిపుణుడిచే సూచించబడిన ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ప్రతి రోగి భిన్నంగా ఉంటారు. అనుకూలీకరించిన సంతానోత్పత్తి చికిత్సను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. చివరగా, స్త్రీ గర్భవతి అయిన తర్వాత, నిరంతర పర్యవేక్షణ అవసరం. స్త్రీ జననేంద్రియ నిపుణుల (గైనకాలజిస్ట్) సలహాలు మహిళలు తమ ఆహారం, మొత్తం ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది” అని అన్నారు.

వైద్య పరిభాషలో పదేపదే గర్భస్రావం జరగడాన్ని పునరావృత గర్భ స్రావం (రికారన్ట్ ప్రెగ్నెన్సీ లాస్) అంటారు. ఇది వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ గర్భస్రావాలుగా నిర్వచించబడింది. ఇది అత్యంత సాధారణ గర్భధారణ సంబంధిత సమస్యలలో ఒకటి, ఇది జంటకు ఒత్తిడి కలిగించటం తో పాటుగా మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. గర్భస్రావం ఎక్కువగా జరిగేలా చేసే బహుళ కారకాలలో, జన్యుపరమైన కారకాలు గర్భస్రావం లేదా పునరావృత గర్భస్రావం యొక్క అత్యంత సాధారణ కారణాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రతి 2 గర్భస్రావాలలో 1 (50%) గర్భస్రావాలు దీని కారణంగా జరుగుతాయి. వయసు మీద పడే కొద్దీ ఇది సర్వసాధారణం అవుతుంది. RPLకి బాధ్యత వహించే జన్యు మార్పులు, భాగస్వాముల లో ఒకరు లేదా ఇరువురు లేదా వారి పిండాలలో ఉండవచ్చు (ఇద్దరు భాగస్వాములు సాధారణ క్రోమోజోమ్‌లను కలిగి ఉన్నప్పటికీ)

విజయవాడలోని నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మి అట్లూరి ఎంబిబిఎస్, ఎంఎస్, ఈ సదస్సులో మాట్లాడుతూ… ”జన్యు సమస్యల కారణంగా పదేపదే గర్భస్రావం అయ్యే రోగులలో ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (PGT) వంటి పద్ధతులు ఉపయోగించబడతాయి. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (PGT) అనేది గర్భధారణకు ముందు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా సృష్టించబడిన పిండాలలో జన్యుపరమైన లోపాలను గుర్తించడానికి ఉపయోగించే ఒక సాంకేతికత.

ఈ ప్రక్రియలో క్రోమోజోమ్ డిఫెక్ట్స్ కోసం పిండాన్ని పరిశీలించడం లేదా తీవ్రమైన వ్యాధికి సంబంధించిన నిర్దిష్ట జన్యు పరివర్తన ఉందా అని చూడటం అవసరం. PGT వారి కుటుంబంలో ఒక నిర్దిష్ట వారసత్వ పరిస్థితిని కలిగి ఉన్న జంటలను వారి పిల్లలకు ఆ సమస్యను పంపకుండా నిరోధించడానికి కూడా అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ సంభావ్య తల్లిదండ్రులకు తీవ్రమైన జన్యుపరమైన సమస్యలు కలిగి ఉన్న పిల్లల పుట్టుకను నిరోధించడంలో సహాయపడుతుంది” అని అన్నారు.

PCOS & సంబంధిత కేస్ స్టడీస్‌పై ఆసక్తికరమైన ప్యానెల్ చర్చతో సమావేశం ముగిసింది. కాన్‌క్లేవ్‌లో చర్చించబడిన ఇతర ఆసక్తికరమైన విషయాలు ఎండోమెట్రియోసిస్‌ను ఎదుర్కోవడం, గర్భాశయ ఫైబ్రాయిడ్‌లలో శస్త్రచికిత్స పాత్ర, ఇతర అంశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News