Monday, December 23, 2024

దివ్యాంగులకు క్రీడలు

- Advertisement -
- Advertisement -

 

డిసెంబర్ 3 తేదీన దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం సింగరేణి మనోవికాస్ స్కూల్ దివ్యాంగ విద్యార్థులకు సింగరేణి ఆద్వర్యంలో క్రీడలను నిర్వహించారు. క్రీడలను పర్సనల్ హెచ్‌వోడి శ్యాంసుందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దివ్యంగులతో చైతన్యం నింపేందుకే వారికి కూడా క్రీడా పోటీలు నిర్వహించి వారు కూడా దేనిలో తక్కువకారనేది రుజువు చేసేందుకే వారికి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.

నేటి క్రీడలలో గెలుపొందిన వారికి శనివారం మందమర్రి జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యాక్రమంలో సీనియర్ పివో మైత్రేయబందు, క్రీడల గౌరవ కార్యాదర్శి సంఘమిత్ర, క్రీడల కోఆర్డినేటర్ చిన్నయ్య, గౌండ్ ఇంచార్జీ నస్పూరి తిరుపతి, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News