Monday, January 20, 2025

డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఆలిండియా యూకో బ్యాంక్ దివ్యాంగ్ జన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ఆదరణ వెల్ఫేర్ అసోసియేషన్ వికలాంగులకు శుభాకాంక్షలు తెలియజేసింది. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారందరినీ సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్షంతో1992లో ఐక్యరాజ్యా సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం ప్రారంభమైంది.

1998నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. వికలాంగుల ఉన్నతికోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఒక ఉద్దేశంతో ముందుకు వెళుతోంది. ఈ సంవత్సరం ఉద్దేశం‘ పూర్తి భాగస్వామ్యం మరియు సమానత్వం’గా ఉంది. అంతర్జాతీయవికలాంగుల దినోత్సవం సందర్భంగా వారికి అవసరమైన సహాయాన్ని అందించడమే మనం చేయవలసిన పని అని ఆదరణ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎస్ భక్త చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News