Thursday, January 23, 2025

కమెడియన్ వీర్‌దాస్‌కు అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నటుడు, స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు 2023 గెలుచుకున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమౌతున్న ‘ వీర్‌దాస్ :లాండింగ్ ’ కామెడీ సిరీస్‌కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటివరకు రెండుసార్లు నామినేట్ అయ్యారు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచారు. ప్రఖ్యాత బ్రిటిష్ షో “డెర్రీ గరల్స్‌” సీజన్ 3 తో ఈ అవార్డు పంచుకున్నారు.

ఈ ఎమ్మీ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగింది. స్వప్నంలా ఇది నమ్మలేని నిజంగా అనిపించిందని వీర్‌దాస్ తన భావోద్వేగాన్ని తెలియజేశారు. ఇది నాకొక్కరికే మైలు రాయి కాదని, భారత కామెడీ రంగానికే ఇది చెందుతుందని పేర్కొన్నారు. వీర్‌దాస్ లాండింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారత్ పేరు ప్రతిధ్వనించడం ఆనందంగా ఉందన్నారు.

స్థానిక కథలను రూపొందించడం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం వరకు నా ప్రయాణం సవాళ్లుగా నడిచింది. నోయిడా నుంచి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వరకు నేను చేరుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని వీర్‌దాస్ తన అనుభూతి తెలిపారు. వీర్‌దాస్‌లో నటించే అవకాశం వచ్చిన నెట్‌ఫిక్స్, ఆకాష్ శర్మ, టైగర్ మ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డు సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News