న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి వాణిజ్యపరంగా అంతర్జాతీయ వైమానిక రాకపోకలను రద్దు చేశారు. ఆ సస్పెన్షన్ నవంబర్ 30 వరకు పొడగించారు. అయితే కార్గో విమానాలకు మాత్రం ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద మినహాయింపులు ఇచ్చారు. భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇరాక్, జపాన్, మాల్దీవ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,ఆఫ్ఘనిస్థాన్ తదితర 31 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇదిలావుండగా అంతర్జాతీయ విమానాల సేవలు ఈ ఏడాది చివరినాటికి సాధారణ స్థితికి వస్తాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ తెలిపారు. టాటా సన్స్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా స్వంతం చేసుకుందన్న విషయం ఇక్కడ గమనార్హం.
అంతర్జాతీయ వైమానిక సేవలు సాధారణ స్థితికొస్తాయి!
- Advertisement -
- Advertisement -
- Advertisement -