కరోనా మహమ్మారితో ఏడాదిగా దూరమైన స్నేహాం
సోషల్ మీడియా వేదికగా ఆనందం పంచుకుంటున్న యువత
నేడు స్నేహితులు దినోత్సవం జరుపుకుంటున్న నగరవాసులు
హైదరాబాద్: ఈలోకంలో అన్ని బంధాల కన్నా మిన్న స్నేహ బంధం. అన్నికంటే బలమైన బంధం కూడా స్నేహమే… అందుకే మనలో ఎవరికైనా కష్టం వస్తే… బంధువుల దగ్గరకు వెళ్లడం కన్నా…. స్నేహితుని దగ్గరకు వెళ్లితే అదీ బెస్ట్ ప్రెండ్ దగ్గరికెళితే కచ్చితంగా సాయం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే స్నేహం కంటే లోకాన ఏదీ గొప్పది కాదన్నాడో సినీ కవి… కష్టమైనా .. నష్టమైనా…బాధలో అయినా సంతోషంలో అయినా ఎప్పడు మన వెంటే నీడలా ఉండే వాడే నిజమైన బెస్ట్ ప్రెండ్…. ఫ్రెండ్ షిప్ డే రోజున తమ స్నేహితులందరికి మధురమైన క్షణాలు గుర్తొచ్చేలా స్నేహితులకు ప్రేమపూర్వక సందేశాలను పంపడం వంటివి చేస్తూ ఉంటారు. ఇకా టెక్నాలజీ పెరగడంతో స్నేహితుల రోజున సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు….కామెంట్లు..పోస్టుల మోత మోగిపోతుంది.
ప్రతిసంవత్సరం ఆగస్టు 1వ తేదీన ఆదివారం స్నేహితుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుకుంటారు. ఈనేపథ్యంలో 2021 సంవత్సరంలో నేడు దినోతవ్సం ఘనంగా జరుగునుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా స్నేహతుల దినోత్సవం జరుపుకునేందుకు ఒక రోజు ముందే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో అడ్వాన్స్ ఫ్రెండ్ షిప్ డే ట్రేడింగ్‌గా నిలుస్తోంది. ఈసందర్బంగా మహానగరంలో సాప్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వం కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఎంప్లాయిస్, వ్యాపార సముదాయాల్లో పనిచేసే సిబ్బంది అంతా ఫ్రెండ్ షిష్ డే ను నిరాడంబరంగా జరుపుకునేందుకు సిద్దమైయ్యారు. అదే విధంగా కరోనా మహమ్మారితో చాలామంది స్నేహితులు ఒకరిఒకరు కలుసుకోలేపోతున్నారు. నేడు ఒకచోట కూర్చొని చిన్నపాటి విందు చేసుకుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటామని నగర యువత పేర్కొంటున్నారు. విదేశాల్లో ఉన్న తమ బాల్య మిత్రులకు వీడియా కాల్ ద్వారా ఆనందాలు పంచుకుంటామని వెల్లడిస్తున్నారు.