Monday, December 23, 2024

విదేశాలకు సిమ్‌కార్డ్‌లు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

విదేశాలకు సిమ్ కార్డ్‌లు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి రట్టు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో సిమ్ కార్డులు కొనుగోలు చేసి కంబోడియా, దుబాయ్‌లకు పంపించి సైబర్ మోసాలకు తెగబడుతోంది. కంబోడియా నుంచి లోక్‌ల సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నట్లు సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతని కంబోడియాకు రవాణా ఉదంతం వెలుగు చూసింది. కంబోడియాలో ఉన్న తెలుగువాళ్లను పోలీసులు రక్షించి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠా పట్టుబడింది. కొనుగోలు చేసిన సిమ్ కార్డులను దుబా య్‌లో ఉన్న విజయ్‌కి పంపిస్తున్నారు. చైనీస్ కంపెనీల కోసం విజయ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. చైనా కంపెనీలు ఎక్కువ ధర ఇచ్చి సిమ్ కార్డు లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యా ప్తులో తేలింది.

ఇండియన్ సిమ్ కార్డ్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్స్ పేరుతోటి విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠాలో జగద్గిరి గుట్టకు చెందిన షేక్ సుభానీ (26), జీడిమెట్లకు చెందిన కె.నవీన్(22), ఆర్‌టిసి క్రాస్ రోడ్డుకు చెందిన ఎం.ప్రేమ్‌కుమార్ అలియాస్ మైఖేల్ అలియాస్ మైక్ టిస్సన్‌లు ఉన్నారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 113 సిమ్‌కార్డులు, మూడు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను వినియో గించి సిమ్ కార్డులను సేకరించారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తారు. ప్రధానంగా దుబాయ్ ద్వారా ఎగుమతి చేస్తున్నారు. పట్టుబడ్డ ఈ ముగ్గురు నిందితులు వివిధ రాష్ట్రాల్లోని అనేక మంది వ్యక్తులు సిమ్ కార్డ్‌లను సేకరించి రవాణా, ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్ లోని ప్రధాన నిందితుడు విజయ్ వారి సహచరుల నుంచి ఈ సిమ్ కార్డులను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News