Monday, December 23, 2024

ఘనంగా అంతర్జాతీయ హాస్పిటాలిటీ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

International Hospitality Day celebrations

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : అతిథ్య రంగంలో సేవలను అందించడం అభినందనీయమని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ హాస్పిటాలిటీ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐహెచ్‌ఎం, ఐహెచ్‌సిఎల్ హెచ్‌ఎన్‌లలో ఉత్తమ సేవలను అందించిన వారికి అవార్డులను ఆయన ప్రదానోత్సవం చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్‌ఎం చైర్మన్ డాక్టర్ సుబోర్నో బోస్, ప్రొఫెసర్ డేవిడ్ ఫోస్కెట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News