Thursday, January 23, 2025

నేడే ‘మేడే’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నేడు మేడే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈ రోజును పురస్కరించుకుని కార్మిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారత వేదికగా కార్మికులు, కర్షకులు, ట్రేడ్ యూనియన్ నేతలను శ్రమ శక్తి అవార్డులను ప్రదానం చేసి మెమొంటో అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మేడే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, చేమకూర మల్లారెడ్డితో పాటు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరుకానున్నట్లు కార్మిక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ శ్రమ్ వెబ్ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోండంటూ ఎవరైతే కార్మికులకు ప్రొత్సహిస్తున్నారో అలాంటి వారికి , అలాగే కార్మిక రంగ ట్రేడ్ యూనియన్ నాయకులకు శ్రమ శక్తి అవార్డులను ప్రదానం చేస్తామని అధికారులు తెలిపారు. మేడే కార్యక్రమంలో
రవీంద్రభారతిలో సోమవారం ఉదయం 9.00 గంటల నుండి కార్మికుల కల్చరల్ ప్రొగ్రామ్స్ కూడా ఉండనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News