Sunday, January 19, 2025

అంతర్జాతీయ స్థాయిలో మన్యంకొండ రోప్ వే

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మన్యంకొండ దేవాలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్‌వే ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక అధ్యయనంలో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశంలోని యాసూ నగరంలో ఉన్న ప్రఖ్యాత కేబుల్ కార్ రోప్ వే ను సందర్శించారు. పర్యటనలో భాగగా కేబుల్ కార్‌ను పరిశీలించి ప్రయాణించారు.

ప్రస్తుతం మన్యంకొండ వద్ద నిర్మాణంలో ఉన్న రోప్ వే స్విట్జర్లాండ్ తరహాలో అద్భుతంగా చేపట్టామని, యాసూ కేబుల్ కర్‌ను సందర్శన తర్వాత ఈ రెండింటి కంటే ఇంకా ఆధునాతనంగా నిర్మిస్తామని తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలు ఎకో టూరిజం కేందరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందన్నారు.

సీఎం కేసీఆర్ పర్యాటక అభివృద్ధ్ది కోసం ప్రాధాన్యం ఇస్తున్నారని ఫలితంగానే అనేక పర్యాటక అభివృద్ధ్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిర్వాయర్లు హైదరాబాద్ ట్యాంక్ బండ్ , మహబూబ్‌నర్ ట్యాంక్ బండ్ సహ రాష్ట్రంలోని పలు చోట్ల పర్యాటక సొబగులను పెంచేందుకు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. మంత్రి వెంట నీటిపారుదల శాఖ మ్యు కార్యర్శి రజత్‌కుమా, పర్యాటక శాఖ ఎండి మనోహర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News