Monday, December 23, 2024

మాతృమూర్తులకు.. అంతర్జాతీయ మదర్స్‌డే శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

International Mothers Day Greetings 2022

హైదరాబాద్: అమ్మ… ఆ పదం సృష్టిలోనే అపురూపమైంది.. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రేమను అందించేంది ఈ జగతిలో ఒక్క అమ్మ మాత్రమే.. తన ఆరోగ్యాన్ని, చివరికి తన అందాన్ని కూడా పణ్ణంగా పెట్టి నవ మాసాలు మోసి ఓ బిడ్డకు జన్మ నిచ్చేది అమ్మ.. మాతృత్వం పొందిన ఆ తల్లి ఆ మరు క్షణం నుంచి తన బిడ్డ ఇష్టాలనే తన ఇష్టాలను మార్చుకునేది అమ్మే… అమ్మ అనే బిడ్డ పిలుపుతో ఉప్పొంగి పోయే ఆ తల్లి.. తనకు ఎంత కష్టమైన బిడ్డను కంటి కి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసిది అమ్మే.. పెరిగి పెద్దైనా ఆ బిడ్డ గొప్పవాడైతే అందరి కంటే ఎక్కువగా మురిసి పోయేది అమ్మే.. అదే బిడ్డకు చిన్న కష్టం వచ్చినా ఆంతులేని ఆవేదన చెందింది కూడా ఆ అమ్మే.. ఈ సృష్టిలో ఒక నిర్వచనం అంటూ ఇవ్వలేని లేనిది ఓ గొప్ప పదం అమ్మ కాగా, ప్రపంచంలో వేల కట్టలేనిది కూడా అమ్మ ప్రేమ ఒక్కటే.. అలాంటి అమ్మ ప్రేమానురాగాలకు గుర్తుగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా మే 8వ తేదీన అంతర్జాతీయ మాతృ దినోత్సవం నిర్వహించుకోవడం వారికి ఇది చిరు సత్కారం మాత్రమే.. ఆదివారం నిర్వహించుకోనున్న మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ మన తెలంగాణ శుభాకాంక్షలను తెలియజేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News