అక్టోబర్ 1… అంతర్జాతీయ వృద్ధుల దినం
రామ కిష్టయ్య సంగనభట్ల… 9440595494
కన్నవారు, తాము పెంచి పెద్ద చేసిన తమ వారు, బంధు బాంధవులు, కడదాక తమకు వెన్నంటి ఉంటారని అనుకుని, అశక్తత ఆవహించిన ముదిమి వయసులో, అందరూ వదిలి వేస్తుండగా, ఒంటరితనం భరించడం భయంకరమైన వేళ… విధి వంచితులైన ఎందరో వయోవృద్ధులు, పడుతున్న బాధలు వర్ణనాతీతం. వయోవృద్ధుల సంక్షేమార్థం చేసిన చట్టాలు, వాటి అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కాగితాలకే పరిమితమై, ఆచరణకు నోచుకోలేక మృగ్యాలే అవుతున్నాయి. భారతదేశములో వ్రస్తుతం 15కోట్లమంది వృద్ధులున్నారు. 2050నాటికి వీరిసంఖ్య 32.3కోట్లకు చేరుతుందని అంచనా. మనరాష్ట్రంలోని వృద్ధుల సంఖ్య అవ్పటికి రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది వయోవృద్ధులు ఉండగా, వీరిలో 10 శాతంకు మించకుండా ఆర్థికంగా, ఆరోగ్యంగా, తమ తమ పిల్లల, బంధువుల వద్ద ఉంటుండగా, మరికొందరు తమ పిల్లలే చేర్పించిన అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో తమ దుస్థితిని తామే తిట్టుకుంటూ, కాలం వెళ్లదీస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ, అనారోగ్యాలకు బలి అవుతూ, నిరాదరణ నీడలో మగ్గుతూ, ఎందరో తమ దుస్థితికి ఆవేదన చెందుతుండటం హృదయ విదారకమై, గుండెలను పిండి వేస్తున్న సచిత్రం సర్వత్రా సాక్షాత్కార మిస్తున్నది. దేశములో నెలకొన్న వరిస్థితులవల్ల సామాన్యులకు నానాటికీ బతుకు భారము అవుతున్న రోజులివి. అదేక్రమము లో వృద్ధులవట్ల నిరాదరణ కూడా అంతకంతకు ఎక్కుపై పోతోంది. దేశాన్ని పాలిస్తోంది వ్రధానంగా వృద్ధనేతలే అయినవ్పటికీ వయోవృద్ధుల సమస్యలకు వరిష్కారం కనబడక పోవడము అసలైన విషాదం. దేశంలోని వ్రతి అయిదుగురి వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేదింవులకు గురవుతున్నారు. ’హెల్పేజ్ ఇండియా’ అధ్యయనం నిగ్గుతేల్చిన విషయమిది. వృద్ధావ్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనం. వాస్తపానికి వృద్ధులు జాతి సంవద! వారి అనుభపాలు ముందు తరాలకు అమూల్యమైన పాఠాలు. అందుకే పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు దీటైన చట్టాలు రూపొం దించాయి. బతికినంత కాలం వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరణతో చూసుకునే విధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందు పరచారు. అనేక దేశాలు చట్టాలు చేసిన 50 ఏళ్ళ తర్వాత, ‘తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007‘ మన దేశంలో రూపొదించ బడ్డది. ఐతే దీని గురించి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించక పోవడం, సదరు చట్టంపై చాలా మందికి అవగాహన లేకపోవడం, సర్వత్రా కనిపిస్తున్నది. ఫలితంగా ఆ చట్టం నిరుపయోగం అవుతున్నది. సంరక్షణ, భద్రత కల్పించాల్సిన వయోవృద్ధులను, సీనియర్ సిటిజన్లను కుమారులు, కూతురులు విడిచిపెట్టి, పరిత్యాగం చేసే విధంగా, బుద్ధి పూర్వకంగా వ్యవహరించినా, చట్ట ప్రకారం శిక్షార్హమే. శిక్షాకాలం ఒక టర్ముకు, మూడు మాసాల జైలు శిక్ష లేదా అపరాధ రుసుము, గరిష్టంగా ఐదు వేల రూపాయలు, రెండింటిని విధించవచ్చు. జిల్లాస్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ కు జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్. డి. ఓ. నిర్వహణ అధికారులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని, సీనియర్ సిటిజన్లకు వేరుగా క్యూ పద్ధతి ప్రవేశపెట్టాలని, దీర్ఘకాలిక, అంతిమ పునర్వికాసం లేని రోగాల చికిత్సల సదుపాయాలు, ప్రభుత్వమే కల్పించాలని, 2007 సంక్షేమ చట్టం నిర్దేశిస్తున్నా, అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం జారీచేసిన వృద్ధుల సీనియర్ సిటిజన్ సంక్షేమ చట్టం పై, సదవగాహన కల్పించడానికి సదస్సులు ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక వృద్ధాశ్రమం, సీనియర్ సిటిజన్ ‘డే కేర్‘ సెంటర్ల నిర్వహణ, ప్రతి మండలంలో వీరి రక్షణ, వైద్య సహాయం కోసం వైద్యశాల, బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా మరిచింది. వయోవృద్ధుల సంక్షేమానికి ఒక డైరెక్టరేటును ఏర్పరచి తగిన నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. జిల్లాలలో సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ లను నెలకొల్పాలి. తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నియమావళి చట్టం 2011 నిబంధనల మేరకు, జిల్లా కేంద్రాలలో అప్పిలేట్ ట్రిబ్యునళ్ళు, డివిజన్ కేంద్రాలలో ట్రిబ్యునళ్ళు ఏర్పాటు చేసి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలి. ఇతర రాష్ట్రాలలో రవాణా సంస్థల బస్సులలో, 30 శాతం రాయితీ ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు లేదు. ఇంటి పన్నులో 30% రాయితీ ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి. కళ్ళజోళ్ళు, వినికిడి తదితర పరికరాలు, వీల్ చైర్స్, వాకింగ్ సాధనాలు అందించాలి. వీరి రక్షణ చర్యలు గైకొనాలి. దేవాలయాలలో ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించాలి.
కొప్పుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు‘
……………………….
ప్రస్తుతం సంబంధిత శాఖకు, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న, అన్ని వృద్ధ ఆశ్రమాల వివరాలతో, ఒక వెబ్ సైట్ రూపొందించే పనిలో అధికారులను నిమగ్నం చేశారు. కరోనా కట్టడిలో భాగంగా, ఆసరా పెన్షన్ల లబ్ది దారుల జాబితాలను అంగన్ వాడీ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. వారి ఇల్లిల్లూ తిరిగి, నిత్యావసర వస్తువుల చేర వేత చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి, అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించి 14567 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు. ప్రజా సంక్షేమం, ప్రధానంగా వికలాంగుల, వృద్ధుల, పేదల, ఆపన్నుల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే, ఆపన్నులకోసం, ప్రత్యేకంగా తమ తల్లి దండ్రుల పేరున, తన సతీమణి స్నేహలత, నిర్వహణలో, ఒక చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తు న్నారు. మనసున్న మారాజు కొప్పుల ఈశ్వర్ ఆధీనంలో, వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నందున, సదరు అంశాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఈశ్వర్, తమపై ప్రత్యేక దృష్టి నిలిపి, సకాలంలో సరైన కార్యక్రమాలు చేపడతారని, వయోజనుల గుండెల నిండా ఆశ నిండి, లక్షలాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి.