Monday, November 18, 2024

రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణను విప్లవాత్మీకరించనున్న ఇంటర్నేషనల్‌ పేషంట్స్‌ యూనియన్‌..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇంటర్నేషనల్‌ పేషంట్స్‌ యూనియన్‌(ఐపీయు) విజయవంతంగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంతో పాటుగా రోగులకు అత్యంత అందుబాటు ధరలలో, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. అత్యున్నత శ్రేణి డాక్టర్లు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులతో రోగులను అనుసంధానించే వినూత్న వేదికగా ఐపీయు నిలువడంతో పాటుగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించుకునే అవకాశం, విధానాల రూపకల్పన వేళ తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు తగిన అవకాశం, వ్యాధి నిర్వహణ గురించి ఒకరికొకరు తెలుపుకునే అవకాశం అందిస్తుంది.

ఇంటర్నేషనల్‌ పేషంట్స్‌ యూనియన్‌ వ్యవస్ధాపకులు డాక్టర్‌ రాజేంద్ర ప్రతాప్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ఆరోగ్య సంరక్షణ రంగం, రోగుల అవసరాలను తీరుస్తున్నప్పటికీ , ఆరోగ్య సంరక్షణ నిర్ణయాల వేళ మాత్రం వారి అభిప్రాయాలకు తగు ప్రాధాన్యత మాత్రం అందించరు. డాక్టర్లు, పరిశ్రమలు వ్యవస్ధీకృతం అయినప్పటికీ,రోగులు మాత్రం ఇంకా అసంఘటితంగానే ఉన్నారు. ఐపీయును సమాన అవకాశాలు కలిగిన క్షేత్రంగా నిలపడంతో పాటుగా ప్రొవైడర్‌ సెంట్రిక్‌ నుంచి ప్రొసీజర్‌ డ్రివెన్‌ హెల్త్‌కేర్‌ గా మార్చనున్నాము’’ అని అన్నారు.

ఈ ఐపీయును అధికారికంగా న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (ఐఐసీ) వద్ద జరిగిన భారతదేశపు మొట్టమొదటి పేషంట్స్‌ సదస్సులో ప్రారంభించారు.

ఈ సదస్సులో నారాయణ హెల్త్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ దేవిశెట్టి మాట్లాడుతూ ‘‘ఇండియాతో పాటుగా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో అతిపెద్ద సమస్య ఏమిటంటే పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సంరక్షణ పేరిట పంచడం. ఈ విధానం కారణంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరిమితంగా లభిస్తుంది. ఆరోగ్య భీమాలో సంస్కరణలు, ఐఆర్‌డీఏఐలో నిబంధనలు కారణంగా రాబోయే ఐదేళ్లలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరంగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయి’’ అని అన్నారు.

భారత ప్రభుత్వ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజీవ్‌ రఘువంశీ మాట్లాడుతూ తమకు ఏం కావాలో బలంగా రోగులు అడగగలగాలి. ఈ కార్యక్రమానికి తగినంతగా తోడ్పాటు లభిస్తే అసలైన ప్రయోజనం చేకూరగలదన్నారు. ఐపీయు యాప్‌ విడుదల సందర్భంగావరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ, ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రేమ్‌ నమ్గ్యాల్‌ మాట్లాడుతూ ఈ యాప్‌ అసాధారణం. ఈ యాప్‌ను ఇండియాకు పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News