Monday, December 23, 2024

సర్కారీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ప్రతీ మండల కేంద్రంలో ఇంటర్నేషన ల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించామని ఇ ప్పటికే ప్రతి మండల కేంద్రంలో అనువైన భూములను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలను జారీ చేశామని డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.ఖమ్మం జిల్లా ఎ ర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామంలోని  ప్రభుత్వ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కౌంటర్లలో దరఖాస్తుల స్వీకరణ, ఏఏ పథకాల గురించి దరఖాస్తు చేస్తున్నది, దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చ ర్యలను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ త మ ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని అందులో భాగంగానే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ స్కూల్ ఏర్పాటు చే స్తున్నామన్నారు. ఈ స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం, మ ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచీకరణలో పెరిగిన పో టీతత్వానికి అనుగుణంగా తెలంగాణ బిడ్డలు కూడా ఈ పోటీలో నిలబడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.

మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ యువత కన్న కలలను, ఆశలను నిజం చేస్తామని, స్కిల్ డెవలప్‌మెంట్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలుకల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తిపై అధ్యయం చేపట్టామని భట్టి తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్తు ప్లాంట్లను నిర్మాణం చేయడంతో అవి ప్రొడక్షన్‌లోకి వచ్చి గత పది సంవత్సరాలుగా తెలంగాణలో కరెంటు కోతలు లేవన్నారు. దామరచర్లలో నిర్మాణం చేస్తున్న యాదాద్రి పవర్‌ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, విద్యుత్తు రంగంపై 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం గత ప్రభుత్వ మోపినప్పటికీ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తామని తెలిపారు.
బడ్జెట్ అంచనాల కోసమే దరఖాస్త్తుల స్వీకరణ
ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, మాట ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28 రోజున 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే అదే ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి, తెలంగాణ సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షల రూపాయలకు పెంచామని ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు పంచామని, ఇందిరమ్మ ఇల్లు కట్టించామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలు సాయం చేస్తుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తామమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని ఇది ప్రభుత్వ మాట, ఇదే ప్రభుత్వ ఆచరణ అని ఆయన తెలిపారు. ఈ సంవత్సరపు చివరి త్రైమాసిక నిధులను కూడా ఎన్నికలకు ముందే డ్రా చేసి గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని భట్టి చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమించి, ఇప్పటికే అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదినే జీతాల చెల్లించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక పరిస్థితులను చెప్పామని ఆయన అన్నారు.
ప్రజాపాలనలో ప్రజలందరూ వాటాదారులే
ఈ ప్రభుత్వం ప్రజలందరిదని, మనందరం ఇందులో వాటాదారులమే నని ఆయన అన్నారు. రెవెన్యూపై వచ్చే ప్రతి పైసా పెట్టుబడి పెడతామని, ఆదా యం సృష్టిస్తాం వచ్చిన లాభాలు అందరికీ పంచడమే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన లక్ష్యంమని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రజాస్వామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన కళాశాల నిర్మాణానికి,గ్రామంలో రెం డు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేస్తామన్నా రు. గ్రామంలో ఉన్న పిహెచ్‌సి ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కావలసిన సౌకర్యాలు, సిబ్బందిని నియమిస్తామన్నారు మధిర నియోజకవర్గం ప్రజలు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలు కా పాడడం కోసం పని చేస్తానని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News