Wednesday, January 22, 2025

అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై పరిమితి విధించిన కెనడా

- Advertisement -
- Advertisement -

ఉన్నత చదువులకోసం కెనడా వెళ్లాలని భావించే విదేశీ విద్యార్థుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం పరిమితి విధించింది. రానున్న రెండేళ్లపాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించింది. అలాగే వీసాల జారీపై పరిమితి విధించింది.

కెనడాలో గృహ సంక్షోభం ముదురుతుండటంతో ప్రభుత్వం తమ దేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్యను కుదించాలని భావించింది. దాంతో ఈ ఏడాది స్టడీ వీసాలపై  3,60,000 అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్లను ఆమోదించాలని నిర్ణయించిందిం. 2023తో  పోలిస్తే ఈ ఏడాది 35 శాతం కోత అమలు చేయాలని నిర్ణయించింది. కొన్నిరాష్ట్రాలు 50 శాతం వరకూ కోత విధించాయి. కెనడాకు వెళ్లి చదువుకోవాలని భావించే వేలాది భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వ నిర్ణయం తీవ్రంగా నిరాశ పరుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కెనడాలో దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News