Friday, September 20, 2024

దేశంలోని టైగర్ రిజర్వుల్లో 1923 పులులు

- Advertisement -
- Advertisement -

International Tiger Day 2020

న్యూఢిల్లీ: దేశంలోని టైగర్ రిజర్వుల్లో మొత్తం 1,923 పులులున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్టు తెలిపింది. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో 231, కర్నాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపోర్‌లో126, అసోంలోని కజిరంగాలో 104, మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్‌లో 104పులులు ఉన్నట్టు తెలిపింది. దేశంలో మొత్తం 50 టైగర్ రిజర్వులుండగా, వీటిలో మొత్తం 1923 పులులు(దేశంలోని మొత్తం పులుల్లో ఇది 65 శాతం) ఉన్నాయని పేర్కొన్నది. జులై 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా 2018లో రూపొందించిన నివేదకను పర్యావరణశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం విడుదల చేశారు. మిజోరం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లోని టైగర్ రిజర్వ్‌ల్లో ఒక్క పులి కూడా లేదని నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలవారీగా చూస్తే మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 526, కర్నాటకలో524, ఉత్తరాఖండ్‌లో 442 పులులున్నాయి.

International Tiger Day 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News