Wednesday, January 22, 2025

అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ అటవీశాఖ కార్యాలయంలో యఫ్‌డిఓ సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్‌కుమార్ పాల్గొన్ని మొక్కలను నాటడం జరిగింది.

వ్యాసరచన పోటీల్లో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తుందని గత దశాబ్థంలో 97శాతం పులులు అదృశ్యమైయ్యాయని వాటిలో 3వేలు మాత్రమే మిగిలి ఉన్నాయని శాస్త్రవేత్త లు కనుగొన్నబడిన తర్వాత 2010 ను ండి అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పులుల సంఖ్య అంతరించకుండా చూడడమే మన లక్షం అని అన్నారు. అడవులను నరకడం వల్ల వాటి ఆవాసాలు లేక పులులు చాలా తగ్గిపోతున్నాయని వాటి సంఖ్య పెరగడానికి అడవులను కాపాడుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మరెడ్డి, జువా జీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, బిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజనీకాంత్, ఫారెస్ట్ రేంజర్ రాఘవేంద్రరావు, బీట్ ఆఫీసర్ రమేష్, కృష్ణయ్య, ఊర శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు, యానం చంద్రయ్య, శ్రీనివాస్, విష్ణుమూర్తి, బండి చెన్నకేశవులు, బీఆర్‌ఎస్ నాయకులు శీలం వెంకటయ్య, మంద సంజీవయ్య, హర్ష, వాసు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News